Homeజాతీయంఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం

ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం

- Advertisement -

ఆరుగురి మృతి, 10మందికి పైగా గాయాలు
లక్నో:
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా… 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ఔరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మంగళవారం ఉదయం దిల్లీ నుంచి బిహార్‌కు ప్రయాణికులతో వెళుతోన్న బస్సు… ఔరాస్ వద్దకు రాగానే ఆగ్రా-లక్నో రహదారిపై ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. మృతుల్లో ఓ ఎస్సై, ఖైదీ కూడా ఉన్నారు. మృతిచెందిన ఎస్సైను రామచంద్రగా, ఖైదీని ఛత్రపాల్‌గా గుర్తించినట్లు ఔరాస్ స్టేషన్ ఆఫీసర్ సంజీవ్ కుష్వాహా తెలిపారు. కేసు విషయమై వారిద్దరూ సివాన్ నుంచి దిల్లీకి వెళ్లి వస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సంజీవ్ కుష్వాహా తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు