హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభం
అమరావతి: టీడీపీ పసుపు పండుగ ‘మహానాడు’ హైబ్రిడ్ విధానంలో బుధవారం మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుంచి ఈ వేడుకను వేలాది మంది కార్యకర్తలు హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని అన్నారు. ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని, టీడీపీ ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని చెప్పారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్-2047 రూపొందించారన్నారు. 63 శాతం యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందని తెలిపారు. 26 ఏళ్లకే రామ్మోహన్ నాయుడు ఎంపీ, తర్వాత కేంద్రమంత్రి అయ్యారన్నారు. గంటి హరీశ్ 27 ఏళ్లకు ఎంపీ అయ్యారని వివరించారు. గతంలో అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు వంటి నేతలు చిన్నవయసులోనే పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని పల్లా శ్రీనివాసరావు గుర్తుచేశారు.
ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు: పల్లా
- Advertisement -
RELATED ARTICLES


