Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివృత్తి విద్యా కోర్సులు బాలికల భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు ...

వృత్తి విద్యా కోర్సులు బాలికల భవిష్యత్తుకు బంగారు భవిష్యత్తు …

హెడ్మాస్టర్ సుమన
విశాలాంధ్ర ధర్మవరం;; వృత్తి విద్యా కోర్సులు బాలికల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతూ వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ సుమన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా జీవి ఈ జెడ్పి గర్ల్స్ హై స్కూల్ (గడ్డం వెంకటమ్మ ఎతిరాజులు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల) తొమ్మిదవ, పదవ తరగతిలోని బాలికలను 104 మందిని ఎంపిక చేసుకొని వారి కోరిక మేరకే వృత్తివిద్యా కోర్సులను నేర్పడం జరుగుతుందని తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ బ్యూటీ వెల్నెస్ అనే కోర్సులను గత ఆరు సంవత్సరాలుగా నేర్పడం జరుగుతోందని తెలిపారు. చదువు పూర్తి అయిన తర్వాత ఈ కోర్సు వారి జీవితానికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు నాలుగు క్యాంపుల ద్వారా విద్యార్థులకు ప్రయోగాత్మకంగా అవగాహన సదస్సును పట్టణంలోని పలు ఇండస్ట్రీలలో స్వయంగా చూపించడం జరిగిందన్నారు. ఒకేషనల్ టీచర్లుగా కళ్యాణి, అనూష విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపడం విద్యార్థులకు వరంగా మారిందని తెలిపారు. ఇండస్ట్రియల్ లో వివిధ యంత్ర కుట్టు మిషన్లపై చేసే పద్ధతిని కూడా బాలికలకు ప్రయోగాత్మకంగా చూపించడం జరిగిందని తెలిపారు. మున్ముందు కూడా మా పాఠశాల మరింత వృత్తి విద్యా కోర్సులో అభివృద్ధిని సాధిస్తుందని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు