Friday, January 10, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసంక్రాంతి మెగా సెటిల్ టోర్నమెంట్.. జి కృష్ణ ప్రసాద్

సంక్రాంతి మెగా సెటిల్ టోర్నమెంట్.. జి కృష్ణ ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ఎమ్మార్సీ ఆవరణంలో (విద్యాశాఖ అధికారి కార్యాలయం) ఈనెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజులపాటు సంక్రాంతి మెగా సెట్టిల్ టోర్నమెంటును నిర్వహిస్తున్నట్లు టీచర్ జి. కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ షటిల్ టోర్నమెంట్ లో పాల్గొనేవారు ఈనెల తొమ్మిదవ తేదీలోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశపు రుసుము 300 రూపాయలు ఉంటుందని తెలిపారు. మ్యాచ్ ఉదయం 6 గంటలకే ప్రారంభమవుతుందని తెలిపారు. పదవ తేదీన ఉదయం 10 గంటలకు డ్రా తీయబడునని తెలిపారు. మెమొంటోలు ఇచ్చు దాతలు వడ్డే బాలాజీ-ధర్మారం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు) అని తెలిపారు. బహుమతులను అఖిల్ కృష్ణ, ప్రేమ్సాగర్, శైలం లక్ష్మీనారాయణ ,సీతారామయ్య, రాజా, అనిల్ కుమార్, కృష్ణమోహన్లు ఇవ్వనున్నారని తెలిపారు. విజేతలకు మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండవ బహుమతిగా 5000 రూపాయలు, మూడవ బహుమతిగా 3000 రూపాయలు నాలుగవ బహుమతిగా వెయ్యి రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి కలవారు ఈ టోర్నమెంట్ లో పాల్గొనాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9985256682 గాని 9515975003 గాని 9182521800కు సంప్రదించాలని తెలిపారు. ఈ మ్యాచ్లన్నీ కూడా ఎంఆర్సి క్రీడా మైదానంలో జరుగునని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు