Homeజాతీయంసంక్షేమ పథకాల నుంచి అంతర్జాతీయ చెల్లింపుల వరకు డిజిటల్ రూపాయి..

సంక్షేమ పథకాల నుంచి అంతర్జాతీయ చెల్లింపుల వరకు డిజిటల్ రూపాయి..

- Advertisement -

ఆర్బీఐ కీలక నిర్ణయం
దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు చిల్లర వ్యాపార రంగంలోనూ డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తన వార్షిక నివేదికలో వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిజిటల్ కరెన్సీ ప్రయోగాత్మక కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ ప్రాంతాల్లో నగదు బదిలీ పథకాల కింద డిజిటల్ కరెన్సీ వినియోగంపై ప్రయోగాత్మక అధ్యయనం నిర్వహించినట్లు ఆర్బీఐ తెలిపింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ లబ్ధిదారులకు అందించే ఆహార రాయితీలను కూడా కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ ద్వారా అందించినట్లు పేర్కొంది.

ఈ విధానంలో లబ్ధిదారులకు జమ చేసిన నిధులను రేషన్ దుకాణాలు, ఎంపిక చేసిన వ్యాపారుల వద్ద నిత్యావసర వస్తువుల కొనుగోలుకు మాత్రమే వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలు ఇవ్వడంతో దీన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆర్బీఐ యోచిస్తోంది. అంతేకాకుండా కేంద్ర బ్యాంకు డిజిటల్ కరెన్సీ ప్రయోగాత్మక కార్యక్రమంలో మరింత మంది భాగస్వాములను చేర్చే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు తన నివేదికలో స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు