బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్‌లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీడియాకు వై ఎస్ షర్మిలా చూపించారు. పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్ షా అవమాన పరుస్తుంటే బీజేపీ ఎంపీలు హేళనగా నవుతున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, వారి రాజ్యాంగం వల్ల ప్రజా స్వామ్యం కాపాడపడుతోందని తెలిపారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ పార్టీ జపం చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీని మోసం చేశారని విమర్శించారు. మోదీ ఏపీకి విశాఖకు వచ్చినప్పుడు ప్రత్యేక హోదా కోసం మాట్లాడారా? అని ప్రశ్నించారు.విభజన హామీల గురించి కూడా మాట్లాడలేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏ హామీ ఇవ్వలేదని చెప్పారు. ఎన్టీఏ కూటమి మోదీతో సక్రమ సంబంధం పెట్టుకుంటే..వైసీపీ అక్రమ సంబంధం పెట్టుకుందని ఆక్షేపించారు. బీజేపీ మతతత్వ పార్టీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు అయ్యి ఉండి, జగన్ మోహన్ రెడ్డి బీజేపీకు వత్తాసు పలుకుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అంబేద్కర్‌ను అవమానించిన తీరు నిరసిస్తూ ఇవాళ సాయంత్రం విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ పార్క్‌లో మౌన దీక్ష చేస్తున్నానని వైఎస్ షర్మిల తెలిపారు.
బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్‌లు ఉండవు.. : షర్మిల
RELATED ARTICLES