విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగలూరు గ్రామం వద్ద ఉన్న రూపా రాజా పీ సి ఎం ఆర్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు హరిదాసు ,గంగిరెద్దు రైతు, పల్లె పడచు, వేషధారణలతో అలరించారు. విద్యార్థులు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు.మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ రైతులకు పంటలు చేతికొచ్చే కాలం ఇది సంపదను, ఆనందాన్ని కుటుంబంతో సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి అని అన్నారు. పండుగలలో ఆధ్యాత్మికతతో పాటు మానవ సంబంధాలు మన సంస్కృతి, సంప్రదాయాలు కలిసి ఉంటాయి. రైతులు కష్టపడి పండించిన పంట ఇళ్లకు చేరే సమయం ఇది ధాన్య లక్ష్మి కి స్వాగతం చెప్పేందుకు ఇంటి ముందు అందమైన రంగువల్లులు దర్శనమిస్తాయి అని తెలిపారు.మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞత ప్రేమను ప్రకటించే పండుగలో సంక్రాంతికి ప్రాధాన్యముందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
రూపా రాజా పీ సి ఎం ఆర్ పాఠశాలలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
RELATED ARTICLES