Homeసినిమాబ్లాస్ట్ జోన్ సినిమా కాదు.. ఒక శిల్పం...

బ్లాస్ట్ జోన్ సినిమా కాదు.. ఒక శిల్పం…

- Advertisement -
  • అమూల్యచందు
  • బ్లాస్ట్ జోన్ ఇది మూవీ అనుకుంటే పొరపాటు. ఒక ఆర్ట్ ఫార్మ్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఒక అన్యాయాన్ని ఒక కరాటేతో ఎలా ముడి పెట్టారు అన్నదే ఇక్కడ కనిపించింది. ఈ మూవీ చూసే ప్రతీ స్త్రీలో ఉత్సాహం కట్టలు తెచ్చుకుంటుంది. అబ్బా ఏముందిరా ఎం చెసార్రా అభిరామి , ప్రెట్టీ ముకుందన్ అనుకోకుండా ఉండరు. ఇందులో హీరో లేడు . సగం బట్టలు లేవు ఆడోల్లకు, ఆరు పాటలు లేవు, మందు మశానం లేదు, మగాళ్ల కొరకొరా చూపులు లేవు, విలన్ ని చంపడానికి వెళ్లే హీరో అనే కాన్సెప్ట్ లేదు అండ్ ఫైనల్లీ కంపు కొట్టి కుళ్ళి కృశించిపోయే తెలుగును అత్యాచారం చేసి ఆ పదాలతో రాసిన ఐటెం సాంగ్ కూడా లేదు. కానీ ఈ మూవీ జస్ట్ మౌత్ పబ్లిసిటీతోనే ఇంత భారీ హిట్ ఎందుకు కొట్టింది అంటే కథ ఉంది. లేడీస్ ని గౌరవించిన కాన్సెప్ట్ ఉంది. ఒక కూతురికి తండ్రి ఎలాంటి పాయింట్స్ తో మోటివేట్ చేసాడు తల్లి బేసిక్ గా భయపడే పాయింట్స్ ని ఎలా చెప్పించాడు. బాబయ్య అంటే సహజంగా ఎంత ఫన్నీగా ఉండాలో ఇవే ఒక కంప్లీట్ ఫ్యామిలీని చూపించాడు. కానీ హీరోయిన్ ప్రెట్టీ ముకుందన్ ఇంచ్ కూడా ఎక్కడ ఎక్స్పోజ్ అనేదే చేయలేదు. అసలు ఈ నలుగురు ఉన్న ఫ్యామిలీలో అసలు తల్లిగా నటించిన అభిరామి మూవీ సగం వరకు సైలెంట్ గా ఉంటె పాపం అనుకుంటాం కానీ ఒక్కసారి ఆమె కొంగు బొడ్లో దోపాక ఈలలు అరుపులు కెవ్వు కేకలే అస్సలు ఊహించని ట్విస్ట్ అది. ఈ మూవీ డైరెక్టర్ ఎంత బాగా తీసాడో ఒక్కో ఫ్రేమ్ వావ్ అనకుండా ఉండలేరు. అసలు ఇది ఒక సినిమాలనే అనిపించదు. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళ ముఖాల్లో ఆటిట్యూడ్ కానీ పొగరు కానీ కనిపించవు. నార్మల్ గా మన ఇళ్లల్లో ఉన్నవాళ్ళ లానే కనిపిస్తారు. అసలు వీళ్ళు ఒక ఊరిని కాపాడారు అనే పే…… ద్ద పాయింట్ ని కరాటే చేసి ఆ గోతిలో కప్పెట్టేసారు అంతే. సింపుల్ సినిమా ఐపోయింది. చూసిన ఫీల్ వచ్చింది. ఎం చేస్సర్రా అనిపించింది. నాన్నంటే ఇలా అమ్మ అంటే అలా బాబయ్య అంటే సరదాగా ఉండాలనేలా అనిపించింది. అంటే ఏ కాలం ఐనా కానీ ప్రపంచం ఎంత దూసుకెళ్ళిపోతున్నా వికసించిపోతున్నా కానీ ఆడోళ్ళ మీద అఘాయిత్యాలు ఆగవు. సో ఆ టైములో పిల్లల ప్రతీ అడుగులో పేరెంట్స్ ఉండరు అంటూ అర్జున్ చెప్పే డైలాగ్ ప్రతీ మిడిల్ క్లాస్ ఫాథర్ చెప్పేదే కానీ తప్పు ఎవరిదీ అని అడిగి అప్పుడు కొట్టమని ఎంకరేజ్ చేస్తాడు. అది కరెక్ట్ ఈ రోజున అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలంటే ఇలాంటిది చాలా అవసరం అని చెప్పకనే చెప్పిస్తాడు డైరెక్టర్. నిజంగా ఈ మూవీని యెంత బాగా తీశారంటే చెప్పలేను ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కారు ఒక్కో ఫ్రేమ్ ని.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు