ముఖ్యఅతిథి ప్రిన్సిపాల్ మల్లికార్జున.
విశాలాంధ్ర ధర్మవరం:: హిందూ సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని ముఖ్య అతిథి ప్రిన్సిపాల్ మల్లికార్జున, జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ ఆదిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు రంగుల హరివిల్లుల తో మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రిన్సిపల్ డాక్టర్ జి మల్లికార్జున మాట్లాడుతూ ముగ్గులనేవి మన భారతీయ సనాతన ధర్మంలో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేవని చెప్తూ, ఇంటిముందు కల్లాపి చల్లి, ముగ్గులను రంగురంగుల హరివిల్లులతో తీర్చిదిద్ది పండుగలను జరుపుకోవడం మన ఆనవాయితీ అని తెలిపారు. విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ ముగ్గులతో మీ జీవితాలను అన్వయించుకోండని అది ఎలాగ అంటే మీ జీవితమని ముగ్గులు రంగుల హరివిల్లులతో సర్వాంగ సుందరంగా నిర్మించుకోవాలంటే మీ వ్యక్తిత్వం నడవడిక నిజాయితీగా, ధైర్యంగా, ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకుంటే తద్వారా మీకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు మరియు ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి విద్యార్థినిలకు ప్రోత్సాహక బహుమతులను ప్రదానం చేశారు .ఇందులో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని నిరుత్సాహ పడకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ వై. నరేంద్ర బాబు , ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
హిందూ సాంప్రదాయాలను ముందు తరాలకు అందించాలి..
RELATED ARTICLES