ఎంఎండిఏ ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్ గారి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలోనిముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఇమామ్ ఆదేశాలతో చలికాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ దాదా పీర్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలం మైలేపల్లి గ్రామంలో ఉన్న కరుణ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు సయ్యద్ రోషన్ జమీర్ హాజరు కావడం జరిగింది. కరుణ వృద్ధాశ్రమం లో ఉన్న వృద్ధులకు మానవసేవే మాధవసేవ అనే నినాదంతో వృద్ధులకు దుప్పట్లు అందజేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు .
జిల్లావ్యాప్తంగా ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల,మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ వివిధ సామాజిక కార్యక్రమాల ద్వారా పేద ప్రజలకు అండగా నిలుస్తు ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ అసోసియేషన్ నాయకులు వృద్ధులకు దుప్పట్లు అందజేయడంపై వృద్ధాశ్రమ నిర్వాహకులు, స్థానిక ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ అసోసియేషన్ నాయకులు కలీం , ఇనాయతుల్లా , జాఫర్ , ముహమ్మద్ గౌస్ , షబ్బీర్ , మస్తాన్ వలి నబిరసూర్ , ముంతు తదితరులు పాల్గొన్నారు .