Saturday, January 11, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా తిరుకళ్యాణం.. ఆలయ అభివృద్ధి కమిటీ

ఘనంగా తిరుకళ్యాణం.. ఆలయ అభివృద్ధి కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీనివాస నగర్ లో ఈనెల ఏడవ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు స్వామివారికి (మూలవిరాట్ విగ్రహానికి) పంచామృతాభిషేకము అర్చన వైకుంఠ ద్వార పూజ, ద్వార ప్రవేశము పలు కార్యక్రమాల్ని ఘనంగా అర్చకులు మోహనస్వామి, రాజేష్ ఆచార్యులు నిర్వహించారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తూ ఉత్తర ద్వారము, దక్షిణ ద్వారం వెంబడి భక్తాదులకు స్వామివారి దర్శనాన్ని కమిటీ వారు కల్పించారు. అనంతరం సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తులకు తీరు కల్యాణ మహోత్సవ వేడుకలను భక్తాదులు నడమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చెన్నంశెట్టి జగదీశ్వర ప్రసాద్, జింక రాజేంద్రప్రసాద్, చెన్నం శెట్టి శ్రీనివాసులు, చెన్నం శెట్టి రమేష్ కుమార్ తో పాటు శ్రీవారి సేవకులు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు