విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న ఆంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ల పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ లక్ష్మి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్-4(ఓసి), రామ నగర్-3(ఎస్టీ) అంగన్వాడీ కేంద్రాలకు అంగన్వాడీ కార్యకర్తలుగా అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హెల్పర్ల పోస్టులు ధర్మవరం పట్టణంలో సంజయ్ నగర్, దుర్గానగర్-1(బీసీ-ఇ), రామనగర్-3(బీసీ-డి), రామనగర్-7(ఓసి), మల్లేనిపల్లి(ఎస్సీ), సి.బత్తలపల్లి(ఎస్సీ)లోని అంగన్వాడీ కేంద్రాల్లో హెల్పర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 25వతేదిలోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి పాస్ అయి ఉండాలని, 01.07.2024నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల్లోపు వయసు ఉండాలని సూచించారు. స్థానికంగా వివాహిత మహిళ ఉండాలని తెలిపారు. అవివాహితులు అనర్హులన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు మీ పంచాయతీ లేదా వార్డు పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయాలలో ఆన్లైన్ పద్దతి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. సిడిపిఓ లక్ష్మి
RELATED ARTICLES