విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు భక్తాదులు కార్యవర్గ సభ్యులు, ఆలయ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ, గణపతి సచ్చిదానంద దత్త జాన బోధ సభా ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. తెల్లవారుజామున నుండి రాత్రి వరకు భక్తాదుల సందడితో ఆలయం కిటకిటలాడింది. అర్చకులు సుదర్శనాచార్యులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ భక్తాదులకు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. కమిటీ ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు దాతలుగా నిర్వహించిన అందరిని కూడా ఘనంగా సన్మానించారు. ఆలయ అలంకరణ, శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకలను విజయవంతం చేసిన దాతలకు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన అందరికీ కూడా కార్యవర్గ సభ్యులు పేరుపేరునా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మే టీకాల కుల్లాయప్ప, శంకర సంజీవులు, గుద్దుటి రామాంజనేయులు, రంగా శ్రీనివాసులు, దత్తా శివ, బేల్లే నాగప్ప, సాగసురేష్ ,ఎస్ జి ఎస్ వాలంటీర్లు, మాతృమండలి వారు పాల్గొన్నారు.
వైభవంగా జరిగిన వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు
RELATED ARTICLES