Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా ఆలయ శిఖర కలశ ప్రతిష్టాపన

ఘనంగా ఆలయ శిఖర కలశ ప్రతిష్టాపన

విశాలాంధ్ర – చిలమత్తూరు : చిలమత్తూర్ పంచాయతీ పరిధిలోని కాపు చన్నంపల్లి గ్రామంలో శనివారం ఘనంగా ఆలయ శిఖర ప్రతిష్టాపన మహోత్సవం గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు, ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి అర్చకులు, వెంకటేశ్వర్లు, కిషోర్ స్వామి, లింగప్ప పోతులప్ప స్వామి విగ్రహాన్ని, శిఖరాన్ని సుందరంగా అలంకరణ చేసి అర్చనలు హోమాలు కలశ స్థాపన, పూర్ణాహుతి గ్రామస్తులు చేత నిర్వహించారు, హాజరైన భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు, ముఖ్య అతిథులుగా మండల టిడిపి నాయకులు టిడిపి కన్వీనర్ రంగారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, తిప్పారెడ్డి, నందీష్, తదితర టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు