Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్వైయస్సార్సీపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా మాసపల్లి సాయికుమార్ నియామకం

వైయస్సార్సీపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా మాసపల్లి సాయికుమార్ నియామకం

విశాలాంధ్ర ధర్మవరం; వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీని మాజీ సిఎం వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్య సాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మాసపల్లి సాయికుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాసపల్లి సాయికుమార్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకం ఉంచి పెద్ద అవకాశం కల్పించినందుకు అందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నాకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కి, మాజీ మంత్రి పెనుకొండ నియోజకవర్గం సమన్వయకర్త ఉషశ్రీ చరణ్కు కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, వార్డు ఇన్చార్జిలకు, కౌన్సెలింగ్ మెంబర్స్ కు, మిత్రులకు, అలాగే నాకు సోషల్ మీడియా ద్వారా, ప్రత్యేకించి ఇంటి వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ సిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు