ఆలయ అడహక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజులపాటు ఆలయ నవీకరణ జీర్ణోధారణ అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమం, కుంభాభిషేక మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ అడ హక్ చైర్మన్ జంగం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పార్లమెంటు సభ్యులు బికే పార్థసారథి, ధర్మవరం నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి నరసింహ రాజు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. అర్చకులు కోనేరాచార్యులు, మకరంద బాబు, భాను ప్రకాష్, చక్రధర్లచే వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 22వ తేదీన సోమవారం దేవత ప్రార్థన, స్వస్తి వాచన, రక్షాబంధన తదితర కార్యక్రమాలు, జూన్ 23వ తేదీన ఉదయం వివిధ హోమాలు అష్టావధాన సేవ, అగ్ని ప్రతిష్ట, తదితర కార్యక్రమాలు, ఇదే రోజు సాయంత్రం వివిధ హోమాలు, మహా పూర్ణాహుతి, మహా శాంతి అభిషేకం తదితర కార్యక్రమాలు, ఇదే రోజు సాయంత్రం కళాజ్యోతి యందు త్రీదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి వారిచే అనుగ్రహ భాషణం అను ప్రవచనం జరుగును అని తెలిపారు. జూన్ 24వ తేదీ బుధవారం పుణ్యాహవాచన నిత్య, దాతాది , జయాధి, ప్రయచిత్తా తదితర హోమాలు
కళావాహనం, చెన్నకేశవ స్వామి వారి విమానం, అమ్మవారి విమాన గోపురమునకు రామానుజ జీయర్ స్వామి వారి ఉపస్థితిలో కుంబాభిషేకం జరుగును అని తెలిపారు. పై కార్యక్రమాలు కర్ణాటక కోలార్ జిల్లా గుట్టపల్లి వాస్తవులు వెంకటరమణాచార్యుల వారి బృందం ఆధ్వర్యంలో నిర్వహించబడును అని తెలిపారు. ఈ కుంభాభిషేకము జరుగు మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం, పుష్ప అలంకరణ ,ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆసక్తి గల దాతలు ఎవరైనా సరే విరాళములు ఇచ్చి సహకరించాలని తెలిపారు. కావున ఈ కార్యక్రమ వేడుకల్లో భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
కుంబాభిషేక మహోత్సవాలకు భక్తాదులు తరలిరండి..
- Advertisement -
RELATED ARTICLES


