Homeజాతీయంనీట్‌-యూజీ రీటెస్టు కోసం అధికారిక వాట్సప్‌ సేవలు ప్రారంభించిన ఎన్‌టీఏ

నీట్‌-యూజీ రీటెస్టు కోసం అధికారిక వాట్సప్‌ సేవలు ప్రారంభించిన ఎన్‌టీఏ

- Advertisement -

నీట్‌-యూజీ 2026 రీటెస్టు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన అధికారిక సమాచారం వేగంగా అందించేందుకు ప్రత్యేక వాట్సాప్ సేవలను ప్రారంభించింది. ఇదే సమయంలో సోషల్‌ మీడియా, ఎస్‌ఎంఎస్‌లు, ఈ-మెయిళ్ల ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ సందేశాల విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎన్‌టీఏ 91 78279 80287 నంబరుతో అధికారిక వాట్సప్‌ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూ టిక్‌ గుర్తింపు ఉంటుంది. పరీక్షా కేంద్రాల వివరాలు, రీటెస్టుకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు, ఇతర అధికారిక అప్‌డేట్‌లు ఈ ఖాతా ద్వారానే పంపించనున్నట్లు తెలిపింది.

ఇతర నంబర్లు లేదా ఈ-మెయిల్‌ ఐడీల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్వసించవద్దు
బ్లూ టిక్‌ గుర్తింపు లేకుండా ఇదే పేరుతో వచ్చే వాట్సప్‌ సందేశాలు లేదా ఇతర సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులకు సూచించింది.అలాగే ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం లేదా ఎలాంటి చెల్లింపులను ఎన్‌టీఏ ఎప్పుడూ కోరదని స్పష్టం చేసింది.ఇలాంటి అభ్యర్థనలు వస్తే వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరించింది.వాట్సప్‌ నోటిఫికేషన్లతో పాటు రీటెస్టుకు సంబంధించిన రిమైండర్‌ సందేశాలను ఎస్‌ఎంఎస్‌, ఈ-మెయిల్‌ ద్వారా కూడా పంపుతున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.అధికారిక ఎస్‌ఎంఎస్‌లు NICPEP అనే సెండర్‌ ఐడీ నుంచే వస్తాయని, అధికారిక ఈ-మెయిళ్లు no-reply.neet.nta@nic.in నుంచే పంపబడతాయని పేర్కొంది. ఇతర నంబర్లు లేదా ఈ-మెయిల్‌ ఐడీల నుంచి వచ్చే సమాచారాన్ని విశ్వసించవద్దని సూచించింది.

రీటెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు తాజా అడ్మిట్‌ కార్డులను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
అలాగే మే 3న నిర్వహించాల్సిన పరీక్ష కోసం జారీ చేసిన అడ్మిట్‌ కార్డులు రీటెస్టుకు చెల్లుబాటు కావని ఎన్‌టీఏ మరోసారి గుర్తు చేసింది.రీటెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు తాజా అడ్మిట్‌ కార్డులను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకుని, అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు