శుభాకాంక్షలు తెలిపిన సినీ, రాజకీయ ప్రముఖులు
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఓ సంచలనం. ఎన్నికల్లో పోటీచేసిన తొలిసారే విజయాన్ని సాధించి ప్రభంజనం సృష్టించారు. పాలనలో తన మార్క్‌ను చూపిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శివకాశిలో ఆదివారం రాత్రే గంటసేపు బాణాసంచా కాల్చి అభిమానులు సందడి చేశారు.
‘తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రార్థిస్తున్నాను’… ప్రధాని మోదీ
‘విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్ని ప్రయత్నాలలో మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తమిళ ప్రజల హక్కులు, గౌరవం, ఆకాంక్షలను పరిరక్షించడంలో, రాష్ట్ర ప్రగతి కోసం కలిసి పనిచేయడంలో నేను మీకు అండగా నిలుస్తాను’… లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
‘విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు చేపట్టే అన్నీ ప్రయత్నాల్లో విజయం సాధించాలని, ప్రజలకు ఇలానే సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నా’…పవన్ కల్యాణ్
‘విజయ్ మీరెప్ప్పుడూ ఆరోగ్యంతో ఉండాలని, ప్రజలకు సేవచేయడానికి అవసరమైన శక్తిని పొందాలని కోరుకుంటూ…పుట్టినరోజు శుభాకాంక్షలు’…తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
‘కోట్ల మంది ప్రేమను సొంతం చేసుకున్న తమ్ముడు విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’…కమల్ హాసన్
‘హ్యాపీ బర్త్‌డే విజయ్ సర్. ఈ ఏడాదంతా మీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’…నయనతార
‘నా సోదరుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’…ఖుష్బూ
ఘనంగా సీఎం విజయ్ పుట్టినరోజు వేడుక
- Advertisement -


