విశాలాంద్ర ధర్మవరం:: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్జీ హోమ్ లో జరిగిన ధర్మవరం జోనల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు బోధన అనుభవం ఉన్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గుదిబండగా మారిందని, దీనివల్ల పాఠశాలలో బోధన కుంటుపడుతుందని ఆయన తెలియజేశారు. టెట్ మినహాయింపు వచ్చేలోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించి అర్హత మార్కులు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ బి.కె ముత్యాలప్ప మాట్లాడుతూ ఎంతోకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చూస్తున్న పిఆర్సి ని వెంకటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డి ఏ లు, ఆర్థిక బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు సానే రవీందర్ రెడ్డి, బలరాముడు, శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధ్యాయుని జిల్లాల విభజనకు కేటాయించేటప్పుడు సీనియార్టీలోని లోపాలను సరిచేసి కట్టుదిగాట్టంగా ఉపాధ్యాయులను జిల్లాల విభజన చేయాలని, మున్సిపాలిటీలకు అర్బన్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ మంజూరు చేయాలని, మున్సిపల్ పాఠశాలలలో కొరతగా ఉన్న తెలుగు, హిందీ, పిడి పోస్టులను వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు.విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను సర్దుబాటును జూన్ నెలలోపే చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిలర్ వాసుకుమార్, ప్రత్యేక ఆహ్వానితులు శంకరనారాయణ, జగదీష్, దుర్గాప్రసాద్, రామక్రిష్ణ,, చంద్రశేఖర్,బాలకదిరప్ప, బాలయ్య, నాగప్ప, శివయ్య,శ్రీనివాసులు, రవికుమార్, తిప్పన్న, చెన్నుడు,వెఃకటరమణ,తదితరులు పాల్గొన్నారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి – ఏపీటీఎఫ్ డిమాండ్
- Advertisement -
RELATED ARTICLES


