Homeఅంతర్జాతీయంహోర్మూజ్‌లో ఇక సుంకాలు లేవు: ట్రంప్

హోర్మూజ్‌లో ఇక సుంకాలు లేవు: ట్రంప్

- Advertisement -


వాషింగ్టన్: హోర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల నుంచి ఎటువంటి సుంకాలు, బీమా ఖర్చులు, ఇతర ఏవిధమైన రుసుములూ వసూలు చేయమని ఇరాన్ హామీ ఇచ్చిందన్నారు. ఒకవేళ ఇది తప్ప్పుడు సమాచారమైతే, వారితో చర్చలను వెంటనే నిలిపివేస్తామన్నారు. ఇక ఇరాన్‌కు నేరుగా ఎటువంటి నిధులు విడుదల చేయడం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మొక్కజొన్న, గోధుమ, సోయాబీన్ తదితర ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు వారికి (ఇరాన్‌కు) సంబంధించిన నిధుల్లోంచి కొంత మొత్తాన్ని అమెరికా రైతులు, పశుపోషకులకు విడుదల చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఇరాన్‌కు ఆహార పదార్థాలు అత్యవసరమని, వాటిని ప్రత్యేకంగా అమెరికా నుంచే కొనుగోలు చేసి సరఫరా చేస్తామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు