చౌడేశ్వరి అమ్మవారి శత జ్యోతుల మహోత్సవంలో పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరంలో అశేష భక్త జనసందోహం నడుమ చౌడేశ్వరి అమ్మవారి శత జ్యోతుల మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. మంగళ, బుధవారాల్లో పట్టణంలో జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన అగ్నిమహోత్సవాన్ని శ్రీరామ్ తిలకించారు. అమ్మవారి జ్యోతుల ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. పట్టణంలోని చేనేతలకు అంతా మంచి జరిగాలా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు