ఆలయ ఈవో వెంకటేశులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో సోమవారం సాయంత్రం మోహిని ఉత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా, అర్చకులు, భక్తాదులు, దాతలు, ఆలయ సిబ్బంది నడుమ మోహిని ఉత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత అర్చకులు మకరంద బాబు, భాను ప్రకాష్, కోనేరా చార్యులు, మూలవిరాట్ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వైనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పల్లకిలో మోహిని ఉత్సవ ఉత్సవాలను ఆశీర్వలు చేసి పట్టణ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. తొలుత దాతలైన గంజికుంట శ్రీధర్ బాబు, గంజికుంట కిషోర్ బాబు పేరిటన అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. పొరాల్ల పుల్లయ్య , వారి శిష్య బృందం ఆలపించిన సంకీర్తనలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఆలయ అర్ చైర్మన్ చర్మం శెట్టి జగదీశ్వర ప్రసాద్ దంపతులు, భక్తాదులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అంగరంగ వైభవంగా మోహిని ఉత్సవ వేడుకలు
RELATED ARTICLES