Homeసినిమావిశ్వవేదికలో ‘రాజమౌళి’ పేరు

విశ్వవేదికలో ‘రాజమౌళి’ పేరు

- Advertisement -

ఫ్రాన్స్‌ మ్యూజియంలో భారతీయ దర్శకునికి దక్కిన గౌరవం
సినిమా:
తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి…విశ్వ వేదికలో మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా అపురూప గౌరవాన్ని అందుకున్నారు. తాజాగా లూమియర్ మ్యూజియంతో పాటు ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల్ని ప్రదర్శించిన స్క్రీనింగ్ రూమ్ని సందర్శించారు రాజమౌళి. ఈ సందర్భంగా కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్ డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా జక్కన్నని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకి ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్వుడ్, క్వెంటిన్ టరంటినో వంటి ప్రపంచ ప్రఖ్యాత డైరెక్టర్ల నేమ్ బోర్డులు ఉండే ప్రతిష్ఠాత్మక ‘మ్యూర్ డే సినియాస్ట్’ (ఫిల్మ్ మేకర్స్‌ వాల్) వద్దకు రాజమౌళిని తీసుకెళ్లారు. అక్కడ ఎర్రటి వస్త్రంతో కప్పి ఉన్న ఫలకాన్ని ఓపెన్ చేయగానే…ప్రపంచ సినిమా దిగ్గజాల పక్కన రాజమౌళి పేరు సగర్వంగా మెరిసిపోయింది. ఈ చారిత్రక క్షణాన్ని చూసి రాజమౌళి భావోద్వేగానికి గురయ్యారు. ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని, ఈ గౌరవాన్ని మరువలేనని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆనందం వ్యక్తం చేశారు. సినిమాను కనిపెట్టిన లూమియర్ బ్రదర్స్‌ జ్ఞాపకారœం ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఈ ‘లూమియర్ మ్యూజియం’ను ఏర్పాటు చేశారు. సినిమా చరిత్రకి ఇదొక పవిత్రమైన స్థలం లాంటిది. ఇప్పుడు అలాంటి చోట హాలీవుడ్ క్లాసిక్ లెజెండ్స్‌ పేర్లు ఉన్న గోడపైనే మన రాజమౌళి పేరు కూడా శాశ్వతంగా నిలిచిపోవడాన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఒక గర్వకారణమైన క్షణంగా అంతా అభివర్ణిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు