Friday, January 17, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగుండెపోటుతో బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి

విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని నాగులబావి కాలనీకి చెందిన వెంకటరమణారెడ్డి (40) అనే బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ (ఆర్మీ ఉద్యోగి) ఈనెల 15వ తేదీ బుధవారం కాశ్మీర్లో గుండెపోటుతో మృతి చెందడం జరిగింది. విధి నిర్వహణలో ఉండగానే ఇటువంటి సంఘటన చేసుకోవడం పట్ల తోటి ఆర్మీ ఉద్యోగులు ఎంతో బాధకు గురయ్యారు. కాశ్మీర్లో అతి తక్కువ ఉష్ణోగ్రత వల్ల గుండెపోటుకు గురికావడం, వెంటనే మృతి చెందడం జరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమాచారాన్ని ధర్మవరంలోని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. మృతుడు వెంకట రమణారెడ్డికు భార్య హరిప్రియ, కుమారుడు మహిధర్ రెడ్డి, కుమార్తె రిత్విక ఉన్నారు. మృతదేహం కాశ్మీర్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి బెంగళూరుకు ఆర్మీ వాహనం ద్వారా ధర్మవరం కు గురువారం రాత్రి చేరుకుంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మృతుడు వెంకటరమణారెడ్డి స్వగ్రామం చెన్నై కొత్తపల్లి మండలం బసనేపల్లి గ్రామంలో అంత్యక్రియలను నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట రమణారెడ్డి ఆకస్విక మృతికి స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మాజీ ఆర్మీ ఉద్యోగులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు