జిల్లా కుష్టు నివారణ అధికారి తిప్పయ్.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో ధర్మవరం డివిజన్లోని మెడికల్ ఆఫీసర్లకు, లెప్రసీ నోడల్ ఆఫీసర్లకు జాతీయ కుష్టు వ్యాధి కుష్టు నిర్మూలన కార్యక్రమం పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కుష్టి నివారణ అధికారి తిప్పయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈనెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు అర్బన్, రూరల్ నందు సర్వే నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలు విషయాలను తెలియజేయడం జరిగిందన్నారు.కుష్టు వ్యాధి మైక్రో బ్యాక్టీరియా లేప్రే అనే స్వచ్ఛమైన వస్తుంది అని, ఈ వ్యాది వ్యాధిగ్రస్తుల నుంచి వారి దుంపల ద్వారా వ్యాపిస్తుంది అని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని రాగి రంగు గల మచ్చలు ఉంటే అలాగే చేతులలో కాళ్లలో బలహీనత ఉన్న, చెవిపై బుడిపెలు ఉన్న, చర్మం పై బుడి పెలు ఉన్న, అవి కుష్టు వ్యాధిగా అనుమానించవలసి ఉంటుందన్నారు. అదేవిధంగా ఈ కుష్టు వ్యాధి నిర్మూలనలో ఆశా వర్కర్లు తమ కేటాయించిన గృహములని సందర్శించి, ఇంటిలో గల ప్రతి వ్యక్తిని పరీక్షించి చర్మంపై స్పష్టమైన మచ్చలు ఉన్నాయేమో గమనించి సర్వే చేయవలసి ఉంటుంది అని తెలిపారు. సర్వే చేసిన రిపోర్టు ను సూపర్వైజర్ అయిన ఏఎన్ఎం కి ప్రతిరోజు అందజేయవలసి ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ
-డాక్టర్ సేల్వియా సాల్మన్, డీపీఎంవోలు రమణ, రెడ్డి కుమార్ రెడ్డి, పి పి ఎం కోఆర్డినేటర్లు నాగేంద్ర ,ఆంజనేయులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం పై అవగాహన సదస్సు..
RELATED ARTICLES