Sunday, January 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి+ గ్రేడ్.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి+ గ్రేడ్.. ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని స్థానిక కె. హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2.57 పాయింట్లతో న్యాక్ బి ప్లస్ గ్రేడ్ సాధించింది అని కే హెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి పత్రికా ముఖంగా తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ… అవసరమైన మేరా వసతులు ఏర్పాటు చేసుకొంటూ దిన దిన ప్రవర్థమానమై న్యాక్ బృంద మూల్యాంకనంలో కళాశాల బి+ గ్రేడ్ పొందడం హర్షణీయం అన్నారు. ఈ నెల 8, 9 తేదీలలో నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (ఎన్ ఎ ఎ సి) బృందం కళాశాలలోని అన్ని విభాగాలను సందర్శించి, విద్యా ప్రమాణాలు పరిశీలించడం జరిగిందన్నారు.
గ్రేడ్ సాధించడంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన అర్హతలు గల అధ్యాపక, అధ్యాపకేతర బృందం వుండడం జరిగిందన్నారు. ఈ అయిదేళ్లలో విద్యార్థులకు మంచి ఉత్తీర్ణతా ఫలితాలు రావడం. ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, క్రీడలలో సాధించిన విజయాలు, అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, జిమ్,
ఆర్.వో. వాటర్ ప్లాంట్, సీ.సీ. కెమెరాలు, కాంపౌండ్ వాల్, పచ్చని పరిసరాలతో కూడిన మంచి వాతావరణం కళాశాలలో వుండడం, న్యాక్ బృందం కీలకంగా పరిగణించడం జరిగిందన్నారు.
కళాశాల అభివృద్ది కోసం మౌలిక వసతుల ఏర్పాటులో ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, పార్లమెంటు సభ్యులు పార్థసారథి , సీపీడిసి మెంబర్లు, మున్సిపల్ అధికారులు, పట్టణంలోని ప్రముఖ దాతలు,ఫూర్వ విద్యార్థినీ, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారం వల్ల గతంలో ఉన్న “సి గ్రేడ్” నుండి బి+ గ్రేడ్ కు కళాశాలను తీసుకురావడం ఆనందదాయకం అన్నారు. ఈ కృషిలో పాత్రికేయ బృందం సహకారం మర్చిపోలేనిదని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. కళాశాలలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి ఈ గ్రేడ్ మరింత దోహద పడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల సిబ్బందికి అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు