Homeక్రీడలునాల్గో టీ 20లోనూ నిరాశే

నాల్గో టీ 20లోనూ నిరాశే

- Advertisement -

కొనసాగుతున్న టీమిండియా వైఫల్యాలు
తప్పల నుంచి పాఠాలు నేర్చుకోవాలి: శ్రేయస్
క్రీడలు:
ఇంగ్లండ్‌తో జరిగిన 4వ టీ20లోనూ భారత జట్టు ఓటమిపాలైంది. బ్రిస్టల్లో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమిండియా నిరాశ మిగిల్చింది. ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పరివర్తన దశలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతుంటాయని, వాటి నుంచి త్వరగా పాఠాలు నేర్చుకోవాలని తెలిపాడు. ‘ఈ ఓటమితో మరోసారి మాకు నిరాశే మిగిలింది. ఈ పిచ్‌పై 158 పరుగుల లక్ష్యమంటే గెలువడానికి ఏమాత్రం సరిపోదు. అందుకు తగ్గట్లుగానే ఇంగ్లండ్ వేగంగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది. లెంగ్త బౌలింగ్‌ను పదేపదే విసిరితేనే గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాం. పేస్‌లో మార్పులు చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు సులభంగా బౌండరీలు కొట్టేశారు’ అని అయ్యర్ వెల్లడించాడు.
వ్యక్తిగత ప్రదర్శన సంతృప్తిదాయకం…
తన వ్యక్తిగత ప్రదర్శన గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ‘నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల మాత్రం నేను సంతోషంగానే ఉన్నాను. జట్టు ఓడినప్పుడు మంచి ఇన్నింగ్స్‌కు విలువ ఉండదు. నిజానికి నేను బాగా ఆడిన దాదాపు ప్రతిసారీ జట్టు గెలిచేది. కానీ దురదృష్టవశాత్తూ ఈసారి అలా జరగలేదు. తదుపరి మ్యాచ్‌కు తప్పులను సరిచేసుకుని అనుకున్న ఫలితం రాబట్టేందుకు ప్రయత్నిస్తాము. యువ క్రికెటర్లలో చాలా మంది తొలిసారి ఇలాంటి పిచ్లపై ఆడుతున్నారు. కాబట్టి తప్పులు సహజమే. అయితే, వీటి నుంచి ఎంత త్వరగా పాఠాలు నేర్చుకుంటామనేదే ముఖ్యం’ అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. నాల్గో టీ20లో శ్రేయస్ అయ్యర్ 49 బంతుల్లో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు