విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణానికి చెందిన గణేష్ క్రికెట్లో అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా జట్టు తరఫున పాల్గొని విజేతగా నిలబడడంతో క్రికెట్ మండల అసోసియేషన్ అధ్యక్షుడు వడ్డే బాలాజీ గణేశుని ప్రత్యేకంగా అభినందిస్తూ ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో షీల్డ్ ను వారు బహూకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 6 నుండి 12వ తేదీ వరకు కడపలో జరిగిన అండర్-12 జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్య వహించి జట్టు గెలుపుకు కీలకపాత్ర పోషించడం జరిగిందని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.
క్రీడాకారునికి షీల్డ్ అందించిన వడ్డే బాలాజీ
RELATED ARTICLES