Sunday, January 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతిని సస్పెండ్ చేయాలి…

బీసీ వెల్ఫేర్ డిడి నిర్మల జ్యోతిని సస్పెండ్ చేయాలి…

బీసీ సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అవినీతి అక్రమ వసూళ్లు…

ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్న చర్యలు ఎందుకు తీసుకోరు..

సస్పెండ్ చేసేవరకు దశలవారీగా ఆందోళనలు..

పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర

ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపిరెడ్డిపల్లి పృథ్వి
విశాలాంధ్ర ధర్మవరం; అవినీతి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సత్యసాయి జిల్లా బీసీ సంక్షేమ శాఖ డిడి నిర్మల జ్యోతిని సస్పెండ్ చేయాలని పీ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, ఏఐఎస్బి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపిరెడ్డి పల్లి పృథ్వీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎన్జీ హోమ్ నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సత్య సాయి జిల్లా పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డెన్ ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. అవినీతి బాగోతం గురించి ఇప్పటికే పత్రికల్లో వచ్చిందని, పక్క ఆధారాలు, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ చూపుతున్న సత్య సాయి జిల్లా కలెక్టర్, మంత్రి సవితమ్మ ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ సొంత జిల్లాలోనే బీసీ సంక్షేమ అధికారిని లక్షలాది రూపాయల అవినీతికి పాల్పడుతుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు నిలదీశారు. విచారణ పేరిట కాలయాపన చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డిడి నిర్మల జ్యోతి పై సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకునే వరకు ఆందోళనలో దశలవారీగా కొనసాగిస్తామని మంజుల నరేంద్ర పాపిరెడ్డిపల్లి పృథ్వి, స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నందకిషోర్,మధు,మారుతి, చైతన్య,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు