రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారన్న ట్రంప్
ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోవాలని సూచన
పుతిన్ ను కలవబోతున్నానని ట్రంప్ వెల్లడి
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ అప్పుడే తన మార్క్ ను చూపిస్తున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో ఒప్పందం చేసుకోకుండా రష్యాను పుతిన్ నాశనం చేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆయన ఒప్పందం చేసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సుదీర్ఘ కాలంగా కొనసాగుతోందని… వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుందని తాను తొలుత భావించానని… కానీ, ఇప్పటికి మూడేళ్లయిందని ట్రంప్ అన్నారు. ద్రవ్యోల్బణంతో పాటు పలు అంశాల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా శాంతిని కోరుకుంటున్నారని అన్నారు. పుతిన్ ను తాను కలవబోతున్నానని… ఉక్రెయిన్ తో ఆయన సంధిని కోరుకుంటున్నారని ఆశిస్తున్నానని ట్రంప్ చెప్పారు. గతంలో పుతిన్ ను ట్రంప్ బాగా అభిమానించారు. ఇప్పుడు ఆయనలో కొంత మార్పు రావడం గమనార్హం.
తొలి రోజే పుతిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ట్రంప్
RELATED ARTICLES