Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ అదనపు తరగతులు నిర్వహించాలి

పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ అదనపు తరగతులు నిర్వహించాలి

- Advertisement -

ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా సాయంత్రం నాలుగు గంటల నుండి 5 గంటల వరకు అదనపు తరగతులను నిర్వహించాలని ఎంఈఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ ఆదేశాల మేరకు ఈ తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ తరగతులు జులై 13 వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు కేటాయించిన యాక్షన్ ప్లాన్ ప్రకారం జరగాలని తెలిపారు. ఈ అదనపు తరగతులు నిర్వహించుటలో హెడ్మాస్టర్లు కీలకపాత్ర వహించాలి. ఎక్కడా ఎటువంటి ఫిర్యాదులు అందకుండా తల్లిదండ్రుల సహకారంతో విజయవంతం అయ్యేలా చూడాలని తెలిపారు.2026-27 విద్యా సంవత్సరంలో పదవ తరగతి పిల్లలు ప్రతి పాఠశాలలో నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని తెలిపారు. అంతేకాకుండా పదవ తరగతి విద్యార్థులలో మూడు గ్రూపులుగా విడదీసి, ఉత్తమ విద్యను అందించేలా కృషి చేయాలని తెలిపారు. డల్లర్స్ విద్యార్థుల విషయంలో మరింత కృషి చేయాలని వారు గుర్తు చేశారు. కావున హెడ్మాస్టర్లు ఈ అదనపు తరగతుల విషయంపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ గానీ, డీఈఓ గానీ, ఇతర అధికారులు గానీ ఆకస్మిక తనిఖీలు ఉంటాయని తెలిపారు. కావున తల్లిదండ్రులు మీ పిల్లలను ప్రోత్సహించే విధంగా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు