Homeజిల్లాలుఅనంతపురంజిల్లా పోలీస్ అధికారులతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం

జిల్లా పోలీస్ అధికారులతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం

- Advertisement -

— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని ఎస్సై, ఆపై స్థాయి పోలీసు అధికారులతో అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ. జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలు మరియు ఇతర కేసుల నమోదు, చేధనల గురించి పోలీస్ స్టేషన్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజలతో మమేకమై వారితో స్నేహభావంతో సహాయకారిగా మెలిగినప్పుడే పోలీసులు పట్ల సదాభిప్రాయం ఏర్పడి విశ్వాసం పెరుగుతుంది. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు. సైబర్ నేరాలు పట్ల ప్రజల్లో అవగాహన చేయడం వారిని అప్రమత్తం చేయడమే మన కర్తవ్యం అని గుర్తెరిగి ప్రతి ఒక్కరు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. సైబర్ సురక్ష కార్యక్రమంలో భాగంగా డిజిటల్ వాహనాల ద్వారా అవగాహన చేస్తూ ప్రజల్లో చేరువు కావాలని సూచించారు
మట్కా, పేకాట, గంజాయి, ఇసుక అక్రమ రవాణా… డ్రంకన్ డ్రైవ్ , ఓపెన్ డ్రింకింగులు, తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయాలని ఆదేశాలు విజిబుల్ పోలీసింగ్ పెంచాలని…తద్వారా నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలు సులువవుతాయని సూచనలు అనంతరం… పెండింగ్ లో ఉన్న గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, పోక్సో & రేప్ కేసులు, డెకాయిటి, రాబరీ, ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్ కేసులు, ప్రాపర్టీ కేసులు, రోడ్డు ప్రమాదాలు, 174. సి ఆర్,పి .సి కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్క్, డిపిఓ కు సంబంధించి పెండింగ్ రిప్లై ఫైల్స్, పెండింగ్, ఎన్ బి డబ్ల్యూ ఎన్ డి పి ఎస్ కేసులలో దర్యాప్తు, రికవరీల గురించి సర్కిల్ వారీగా పోలీస్ అధికారులతో సమీక్ష చేశారు.
జిల్లాలో విధుల్లో మంచి ప్రతిభ చూపిన 161 మంది పోలీసు అధికారులు, ఏపిపిలకు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం.నాగభూషణం, ఎస్ మహబూబ్ బాషా, డీఎస్పీలు రవిబాబు, ఎ.శ్రీనివాస్, పలువురు సిఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు