Homeజిల్లాలుఅనంతపురంపీజీఆర్‌ఎస్ లో 130 ఫిర్యాదులు

పీజీఆర్‌ఎస్ లో 130 ఫిర్యాదులు

- Advertisement -

విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా ప్రజల సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ‘పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని బాధితుల నుండి 130 పిటీషన్లను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రతి అర్జీదారుడి సమస్యను ఆయన ఓపికగా విన్నారు.
​ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు ఎం.నాగభూషణం, ఎస్ మహబూబ్ బాషాలు కూడా పాల్గొని అర్జీల స్వీకరణలో భాగస్వాములయ్యారు. అక్కడికక్కడే ఫోన్ లైన్లో ఆదేశాలు: కేవలం అర్జీలు తీసుకోవడమే కాకుండా, సమస్యల తీవ్రతను బట్టి జిల్లా ఎస్పీ గారు తక్షణమే స్పందించారు. అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత క్షేత్రస్థాయి పోలీస్ అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు