విశాలాంధ్ర -ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నైపుణ్యాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఇంటర్మ్ ప్రోగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రధానమంత్రి ఇంటర్మ్ షిప్పు లో పలు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భారతదేశంలోని అగ్రసేని కంపెనీలలో 12 నెలల పరిశ్రమల అనుభవము, భారత ప్రభుత్వం ద్వారా నెలవారి సహాయం 4,500 రూపాయలు పరిశ్రమల ద్వారా 500 రూపాయలు ఉంటుందని తెలిపారు. సంఘటనల కోసం 6000 వన్ టైం గ్రాంట్ ఉంటుందని తెలిపారు. భారత ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్ముకు బీమా కవరేజ్ ఉంటుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ఈనెల 10వ తేదీతో మొదలుకొని 21వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ నమోదు లింకు కూడా చేసుకునే అవకాశం కలదు అని తెలిపారు. ఈ ఇంటర్మ్ షిప్ ప్రోగ్రాం కు నిరుద్యోగులు 21 నుండి 24 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ లక్ష్మి సెల్ నెంబర్ 9182388465కు సంప్రదించాలని తెలిపారు.
ప్రధానమంత్రి ఇంటర్మ్ షిప్ ప్రోగ్రాం.. ఎంపీడీవో సాయి మనోహర్
RELATED ARTICLES