ఇన్నాళ్లూ పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిరుపయోగంగా కనిపించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఇప్పుడు జలకళను సంతరించుకుంది. ఈ నెల 14న అనకాపల్లి జిల్లాలో పోలవరం ఎడమ కాలువకు అఖండ హారతి నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా అధికారులు పోలవరం ప్రాజెక్టు నుంచి 182 కిలోమీటర్ల పొడవైన ఎడమ కాలువలోకి నీటిని విడుదల చేశారు. విడుదల చేసిన నీరు ప్రస్తుతం కాకినాడ జిల్లా వరకు చేరుకుంది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద పోలవరం ఎడమ కాలువ నిండుకుండలా ప్రవహిస్తూ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో కనిపించిన ఈ కాలువ ఇప్పుడు నీటితో కళకళలాడుతుండటం స్థానికులను ఆనందానికి గురిచేస్తోంది.
ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు.. ఎడమ కాలువలో పరుగులు తీస్తున్న నీరు
- Advertisement -
RELATED ARTICLES


