విశాలాంధ్ర ధర్మవరం;; సినీ హీరో విక్టరీ వెంకటేష్ తీసిన సినిమా”సంక్రాంతికి వస్తున్నాము”ప్రేక్షకుల హృదయాలలో గూడుకట్టుకుంది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ ఫాన్స్ అభిమానులు వెంకటరమణ లక్ష్మి, ఆలకుంట పోతులయ్య, ఎస్. రామకృష్ణ, 37వ వార్డు ఇన్చార్జి ఓమ్ ప్రకాష్, బి. లక్ష్మీనారాయణ, చిన్న కుళ్లాయప్ప, సాకే గంగాధర్లు పట్టణంలోని రంగా థియేటర్లో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ సినిమా ఎంతో విజయాన్ని సాధించిందని, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలతో నేడు ఎంతో విజయం సాధించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొదటి వారంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్ నూరుకోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ సృష్టించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలను జరుపుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం డైరెక్టర్ అనిల్ రామపూడి వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతలు శిరీష్ పట్టణ ప్రజలకు థియేటర్ యజమానికి శతకోటి వందనాలను తెలియజేశారు. మున్ముందు తాము సేవా కార్యక్రమాలను కూడా చేపడతామని వారు ప్రకటించారు.
విక్టరీ వెంకటేష్ సినిమా విజయం పట్ల అభిమానులు హర్షం
RELATED ARTICLES