Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్బంజారా సమస్యలను పరిష్కరించండి..

బంజారా సమస్యలను పరిష్కరించండి..

ఏఐబిఎస్ఎస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ చక్రి నాయక్, మండల జనరల్ సెక్రెటరీ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; బంజారా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ కమిషన్ మెంబర్ జతోటు హుస్సేన్ కు ఏఐబి ఎస్ ఎస్ స్టేట్ జనరల్ సెక్రెటరీ చక్రి నాయక్ మండల జనరల్ సెక్రెటరీ గోపాల్ నాయక్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేస్తూ సత్యసాయి జిల్లా మండల కేంద్రంగా బంజారా భవన్ ఏర్పాటు చేయాలని, తండాలో త్రాగునీటి సమస్యను నివారించాలని, సెల్ టవర్ ఏర్పాటు చేయాలని, బీటీ రోడ్డును ఏర్పాటు చేయాలని, ఎస్టీ అట్రాసిటీ కేసు పురోగతిని సాధించేలా కృషి చేయాలని వారు తెలిపారు. స్పందించిన నేషనల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ మాట్లాడుతూ తమ సమస్యలను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐబిఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు