HomeజాతీయంNEET, JEE విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఉచిత AI టూల్స్‌తో శిక్షణ

NEET, JEE విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఉచిత AI టూల్స్‌తో శిక్షణ

- Advertisement -

విద్యార్థుల చదువుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత చేరువ చేసేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.NEET, JEE, GRE వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక AI ఆధారిత సాధనాలను విస్తరించింది.ఈ విషయాన్ని ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ వెల్లడించారు.అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 140కిపైగా దేశాల్లోని కళాశాల విద్యార్థులకు ఉచితంగా గూగుల్ AI సబ్‌స్క్రిప్షన్లు అందించనున్నట్లు తెలిపారు.

కొత్త లెర్నింగ్ ఫీచర్లతో ఇంటి నుంచే వ్యక్తిగత శిక్షణ
కొత్తగా తీసుకొచ్చిన లెర్నింగ్ ఫీచర్ల ద్వారా విద్యార్థులు ఇంటి నుంచే తమ చదువును కొనసాగించవచ్చు.గూగుల్ సెర్చ్, జెమిని, యూట్యూబ్ వంటి డిజిటల్ వేదికలను ఉపయోగించుకుని తమ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత శిక్షణ పొందే అవకాశం ఉంటుంది.సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో సుందర్ పిచాయ్ దీనిపై వివరాలు వెల్లడించారు.గూగుల్ సెర్చ్ ద్వారా ఏ పరీక్షలకు ప్రిపరేషన్ చేసుకోవచ్చనే అంశాన్ని ప్రస్తావిస్తూ.. SAT, ACT, AP, ENEM, GRE, JEE, LSAT, MCAT, NEET వంటి ప్రధాన పోటీ, ప్రవేశ పరీక్షలకు గూగుల్ వేదికగా ఉచిత శిక్షణ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

భారతీయ విద్యార్థులకు 12 నెలలు ఉచిత AI సబ్‌స్క్రిప్షన్
గూగుల్ ప్రకటించిన గ్లోబల్ ఆఫర్‌లో భాగంగా అమెరికాలోని విద్యార్థులకు 5TB స్టోరేజ్‌తో ‘గూగుల్ AI ప్రో’ అందించనున్నారు.భారత్ సహా మరో 140కి పైగా దేశాల్లోని కళాశాల విద్యార్థులకు ‘గూగుల్ AI ప్లస్’ సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా అందిస్తున్నారు.ఈ ఆఫర్ ద్వారా భారతీయ విద్యార్థులు ‘జెమిని ఆమ్ని (Gemini Omni)’ని ఉపయోగించుకోవచ్చు.సాధారణ వినియోగంతో పోలిస్తే రెండు రెట్లు అదనపు వినియోగ పరిమితులు కూడా లభిస్తాయి.వీటితో పాటు 400GB క్లౌడ్ స్టోరేజ్ సదుపాయం అందుతుంది. యూట్యూబ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలు కోరుకునే విద్యార్థుల కోసం కూడా గూగుల్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.

జెమినిలో ప్రత్యేకంగా ‘స్టూడెంట్ హబ్’
‘గూగుల్ AI ప్రో’, ‘యూట్యూబ్ ప్రీమియం’ బండిల్‌పై 70 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.దీంతో ప్రకటనల అంతరాయం లేకుండా యూట్యూబ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను వినియోగించుకోవచ్చు.విద్యార్థులు తమ చదువును మరింత సులభంగా నిర్వహించుకునేలా జెమిని యాప్‌లో ‘స్టూడెంట్ హబ్’ను ప్రవేశపెట్టారు.దీని ద్వారా చదువుకు అవసరమైన నోట్‌బుక్స్, ఫ్లాష్‌కార్డ్స్, గ్రాఫ్స్, ఇంటరాక్టివ్ విజువలైజేషన్లను విద్యార్థులే రూపొందించుకోవచ్చు. తమ అభ్యాసానికి అనుగుణంగా ఈ సాధనాలను ఉపయోగించుకోవచ్చు.

బలహీనమైన అంశాలను గుర్తించే డీప్ రీసెర్చ్
జెమినిలో అందుబాటులోకి వచ్చిన ‘డీప్ రీసెర్చ్’ ఫీచర్ విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని అంచనా వేయడంలో ఉపయోగపడుతుంది.చదువులో ఏ అంశాలపై అవగాహన తక్కువగా ఉందో గుర్తించి, వాటికి అనుగుణంగా ప్రాక్టీస్ క్విజ్‌లను రూపొందిస్తుంది.దీంతో విద్యార్థులు తమ బలహీనతలను గుర్తించి, వాటిని అధిగమించేందుకు సొంతంగా చదువు ప్రణాళికను రూపొందించుకోవచ్చు.

డిజిటల్ క్లాస్‌రూమ్‌లలోనూ AI మార్పులు
గూగుల్ సెర్చ్‌లో AI సాంకేతికతను అనుసంధానం చేయడం ద్వారా క్లిష్టమైన అంశాలను బొమ్మలు, విజువల్స్ రూపంలో సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించారు.గూగుల్ లెన్స్ ద్వారా ప్రయోగాత్మక అంశాలను దశలవారీగా నేర్చుకునే సదుపాయం కూడా ఉంటుంది.ఉపాధ్యాయుల కోసం గూగుల్ క్లాస్‌రూమ్‌లోనూ కొత్త సాధనాలను జోడించారు. వీటి ద్వారా టీచర్లు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించవచ్చు.ప్రతి విద్యార్థి అవసరాలు, నేర్చుకునే స్థాయిని బట్టి తగిన బోధనా విధానాన్ని రూపొందించేందుకు ఈ టూల్స్ సహాయపడతాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు