Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాశ్రీ దుర్గమ్మ మెడలో రూ.21 లక్షల విలువైన బంగారు నెక్లెస్ విరాళం

శ్రీ దుర్గమ్మ మెడలో రూ.21 లక్షల విలువైన బంగారు నెక్లెస్ విరాళం

- Advertisement -

141 గ్రాముల బరువు గల రాళ్లతో కూడిన హారంపై రాధాకృష్ణుల బొమ్మ

విశాలాంధ్ర – ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి విజయవాడ లో సీతారాంపురం ప్రాంతానికి చెందిన తవ్వా పుల్లమ్మ (C/O చెక్క వెంకట సుబ్బారావు) ఆలయ అధికారులను కలిసి శ్రీ అమ్మవారిపై ఉన్న భక్తిశ్రద్ధలతో ఈ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్తమిత్రుడు (ఫ్యామిలీ ఫ్రెండ్) కావడంతో, ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.శ్రీ అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని (రాళ్ళతో కూడిన బంగారు పూసల పేరు) ఆమె అందజేశారు. ఈ ఆభరణం యొక్క అంచనా విలువ సుమారు ₹21,00,000 (ఇరవై ఒక్క లక్షల రూపాయలు) ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీ రామబ్రహ్మం, మరియు టెంపుల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గార్ల సమక్షంలో ఆలయ అధికారులకు అధికారికంగా అందజేశారు. ఆలయ నిబంధనల ప్రకారం విరాళాన్ని స్వీకరించి, దాతకు ఆలయ అధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శనం అనంతరం అమ్మవారి వేద పండితుల ఆశీర్వచనం అందించినారు. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) అమ్మవారి చిత్రపటము ప్రసాదములు రసీదును అందజేసినారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు