Homeఆంధ్రప్రదేశ్దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలు.. నేటి నుంచి కందా ఎక్స్‌ప్రెస్‌ సేవలు

దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలు.. నేటి నుంచి కందా ఎక్స్‌ప్రెస్‌ సేవలు

- Advertisement -

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది.అధిక ధరలు నమోదవుతున్న ప్రధాన నగరాలకు బఫర్ నిల్వల్లోని ఉల్లిని వేగంగా తరలించేందుకు ‘కందా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.ఈ ప్రత్యేక రైళ్లు సోమవారం (ఆగస్టు 24) నుంచి సేవలు ప్రారంభించనున్నాయి.కిలో ఉల్లి సగటు రిటైల్ ధర శనివారం నాటికి దేశవ్యాప్తంగా రూ.42కు చేరింది.గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 45 శాతం ఎక్కువ కాగా.. గత నెలతో పోల్చితే 19 శాతం పెరిగింది.దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.65కు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.35గా ఉన్న ధర ఇప్పుడు భారీగా పెరిగింది.

మహారాష్ట్రలో ఖరీఫ్ పంట తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణం
చెన్నైలోనూ కిలో ఉల్లి రూ.58కు విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే కాలంలో అక్కడ ధర రూ.33గా ఉంది. కేరళ,అసోం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఉల్లి ధరలు గణనీయంగా పెరిగాయి.ఉల్లి ధరల పెరుగుదలకు మహారాష్ట్రలో ఈసారి ఖరీఫ్ పంట దిగుబడి తగ్గడం ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.దేశంలోనే అతిపెద్ద ఉల్లి ఉత్పత్తి రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో ఈసారి దిగుబడి 5 నుంచి 7 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.సాగు విస్తీర్ణం తగ్గడం, రుతుపవనాల రాక ఆలస్యం కావడం వంటి కారణాలు పంట దిగుబడిపై ప్రభావం చూపాయి.మరోవైపు పాత ఉల్లి నిల్వలు తగ్గిపోవడం,కొత్త పంట మార్కెట్‌కు రావడానికి మధ్య ఏర్పడిన అంతరం కూడా ధరలు పెరగడానికి కారణమైంది.

1.2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించిన నాఫెడ్ (NAFED), ఎన్‌సీసీఎఫ్ (NCCF)
ఈ పరిస్థితుల్లో మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం నుంచి ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువహటి వంటి ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్ల ద్వారా ఉల్లిని తరలించనున్నారు.వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే ఈ ప్రణాళికను ధ్రువీకరించారు.అధిక ధరలు నమోదవుతున్న మార్కెట్లకు ఉల్లి సరఫరాను పెంచి, ధరలు మరింత పెరగకుండా అడ్డుకోవడమే తమ ఉద్దేశమని ఆమె తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో నాఫెడ్ (NAFED), ఎన్‌సీసీఎఫ్ (NCCF) సంస్థలు కలిసి సుమారు 1.2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వం వద్ద మాత్రమే కాకుండా రైతుల వద్ద కూడా అవసరమైన స్థాయిలో ఉల్లి నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.

ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లు
ధరల స్థిరీకరణ నిధి (Price Stabilisation Fund) కింద ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు.గతంలోనూ ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రత్యేక రైళ్లను వినియోగించింది. 2024 అక్టోబర్‌లో కూడా ఉల్లి సరఫరాను పెంచేందుకు ఇదే తరహా చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా, ఉల్లితో పాటు చక్కెర ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం లూజ్ చక్కెర కిలో రూ.62.5 వరకు పలుకుతోంది.అయితే దేశంలో చక్కెరకు అవసరమైన స్థాయిలో నిల్వలు ఉన్నాయని ఆహార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు