Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ నాయకులు

విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపురంలోని నారాయణ హాస్టల్ బాయ్స్ క్యాంపస్ లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య బత్తలపల్లి మండల కార్యదర్శి వెంకటేష్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు నాగభూషణ సన్న పెద్దన్న తదితర నాయకులు మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చుతూ జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు ఆరాధిసి, న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు