మరమ్మత్తులు చేస్తున్న సిబ్బంది
విశాలాంధ్ర, ఉరవకొండ: ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయం పక్కనే సిస్టం ట్యాంకుకు సంబంధించిన పైపు విరిగిపోయి రోజుల తరబడి నీరు వృథాగా రోడ్లపై ప్రవహిస్తున్న విషయంపై సోమవారం( నేడు) విశాలాంధ్ర దినపత్రికలో ‘నీటి బొట్టు వృథా.. పట్టించుకోని పాలకవర్గం’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్తకు గ్రామపంచాయతీ అధికారులు స్పందించారు. వార్తను పరిశీలించిన గ్రామపంచాయతీ అధికారి షమీర్ భాష వెంటనే స్పందించి లీకేజీ అవుతున్న కొళాయిలను గుర్తించి మరమ్మతులు చేయించారు. దీంతో నీటి వృథాకు అడ్డుకట్ట పడింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించేందుకు కృషి చేసిన విశాలాంధ్రకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


