Homeజాతీయంsugar price: హోల్‌సేల్ మార్కెట్‌లో పంచదార ధరలకు బ్రేక్.. రిటైల్‌లో మాత్రం భారం!

sugar price: హోల్‌సేల్ మార్కెట్‌లో పంచదార ధరలకు బ్రేక్.. రిటైల్‌లో మాత్రం భారం!

- Advertisement -

పంచదార ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
10 లక్షల టన్నుల ముడి పంచదారను ఎలాంటి దిగుమతి సుంకం లేకుండా తీసుకొచ్చేందుకు అనుమతించడంతోపాటు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవడంతో గత కొద్ది రోజులుగా హోల్‌సేల్ ధరలు దాదాపు 15 శాతం తగ్గాయి. అయితే ఈ తగ్గుదల ప్రభావం మాత్రం ఇప్పటివరకు వినియోగదారులకు పూర్తిగా చేరలేదు. రిటైల్ మార్కెట్‌లో కిలో పంచదార ధర ఇంకా రూ.75 వద్దే కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో ఫ్యాక్టరీ గేట్, హోల్‌సేల్ మార్కెట్ ధరలు క్వింటాల్‌కు దాదాపు రూ.800 మేర తగ్గాయి. దీంతో హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో పంచదార ధర సుమారు రూ.62కు దిగొచ్చింది.

రిటైల్‌లో ఇంకా తగ్గని ధరలు..
రాబోయే రోజుల్లో మరో రూ.3 వరకు ధర తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.సుంకం లేకుండా దిగుమతులకు అనుమతిస్తామని, అక్రమంగా నిల్వ చేసిన పంచదారపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేయడంతో మార్కెట్‌లో ధరలు వేగంగా దిగివచ్చాయి.ప్రస్తుతం దేశంలో దాదాపు 36 లక్షల టన్నుల పంచదార నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.అక్టోబర్ 31 వరకు దిగుమతులకు ఇచ్చిన అనుమతితో అదనంగా 10 లక్షల టన్నుల పంచదార అందుబాటులోకి రానుంది.అక్టోబర్ మధ్యలో కొత్త క్రషింగ్ సీజన్ ప్రారంభమయ్యే వరకు దేశంలో పంచదార నిల్వలకు ఎలాంటి కొరత ఉండబోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.అయితే రిటైల్ మార్కెట్‌లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.

అక్టోబర్ వరకు సరిపడా నిల్వలు ఉన్నాయన్న ప్రభుత్వం
వ్యాపారులు గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన పాత పంచదార నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు.ఆ నిల్వలు పూర్తయిన తర్వాత తక్కువ ధరకు కొనుగోలు చేసిన కొత్త స్టాక్ మార్కెట్‌లోకి వస్తేనే హోల్‌సేల్ ధరల తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అంటే కేంద్రం తీసుకున్న చర్యలతో హోల్‌సేల్ మార్కెట్‌లో పంచదార ధరలు ఇప్పటికే నియంత్రణలోకి వచ్చినా..రిటైల్ మార్కెట్‌లో మాత్రం ఆ ప్రభావం ఇంకా కనిపించడం లేదు.పాత నిల్వలు పూర్తయి,కొత్తగా తక్కువ ధరకు కొనుగోలు చేసిన పంచదార మార్కెట్‌లోకి వచ్చిన తర్వాతే వినియోగదారులకు ధరల తగ్గుదల ప్రయోజనం అందే అవకాశం ఉంది.ఇందుకు మరికొంత సమయం పట్టొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు