విశాలాంధ్ర, పెనుకొండ: మండల పరిధిలోని వెంకటగిరిపాళ్యం గ్రామానికి చెందిన దివ్యాంగులు వడ్డే శ్రీరాములు, చాకలి ముత్యాలప్ప తమ కష్టాలను వివరిస్తూ ట్రైసైకిళ్లు అందించాలని బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవితను కోరారు. వారి అభ్యర్థనపై మంత్రి సవిత వెంటనే స్పందించి, గంట వ్యవధిలోనే ఉచితంగా ట్రైసైకిళ్లను అందజేశారు. ట్రైసైకిళ్లు అందుకున్న సమయంలో వారి ముఖాల్లో కనిపించిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి సవిత తెలిపారు. పేదలు, దివ్యాంగుల సంక్షేమం, ఆత్మగౌరవం, సాధికారత కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవసరమైన సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దివ్యాంగులు స్వావలంబనతో జీవించేలా వారికి అవసరమైన సహాయాన్ని అందించడం తమ ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు.
వికలాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేసిన మంత్రి సవిత…
- Advertisement -
RELATED ARTICLES


