– టాటా రాలిస్ నుండి రెండు నూతన పంట సంరక్షణ ఉత్పత్తులు ఆవిష్కరణ
-వరి పంట తెగుళ్లుకు సమర్ధవంతమైన అడ్డుకట్ట
విశాలాంధ్ర – విజయవాడ లబ్బీపేట : రైతులు ఎదుర్కొంటున్న పంట వ్యాధులు, పురుగుల సమస్యలకు మరింత సమర్థవంతమైన పరిష్కారాలను అందించే లక్ష్యంతో టాటా గ్రూప్ సంస్థ రాలిస్ ఇండియా లిమిటెడ్ సరికొత్త పంట సంరక్షణ ఉత్పత్తులు ‘మార్సెలస్’ (Marcellus) మరియు ‘సైలెంట్రా’ (Silentra) ఉత్పత్తులను విజయవాడలో జి ఆర్ టి హోటల్లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఛానల్ భాగస్వాములు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
వివిధ శిలీంద్ర వ్యాధుల నియంత్రణకు మార్సెలస్
రెండు ప్రసిద్ధ శిలీంద్రనాశకాల ప్రత్యేక సమ్మిళిత సాంకేతికతతో రూపొందించిన మార్సెలస్, పంటల్లో వచ్చే వివిధ శిలీంద్ర వ్యాధులపై నివారణాత్మకంగా, చికిత్సాత్మకంగా సమర్థవంతమైన నియంత్రణ అందించేందుకు రూపొందించబడింది.
వరి, మిరప, టమాటా, జీలకర్ర వంటి ప్రధాన పంటల్లో దీనిని సిఫారసు చేస్తున్నారు. షీత్ బ్లైట్, లీఫ్ బ్లాస్ట్, డర్టీ ప్యానికిల్, ఎర్లీ బ్లైట్, పౌడరీ మిల్డ్యూ, ఆంత్రాక్నోస్, లీఫ్ స్పాట్, ఆల్టర్నేరియా బ్లైట్ వంటి ముఖ్యమైన శిలీంద్ర వ్యాధుల నియంత్రణలో ఇది ఉపయోగపడుతుంది.
మార్సెలస్ సిఫారసు మోతాదు హెక్టారుకు 200 గ్రాములు లేదా ఎకరానికి 80 గ్రాములు.
వరి పంటలో సుడిదోమ నియంత్రణకు సైలెంట్రా :
వరి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన పురుగు సమస్యల్లో ఒకటైన సుడిదోమ నియంత్రణకు ‘సైలెంట్రా’ (Silentra) ను రాలిస్ పరిచయం చేసింది. వరి పంటను సుడిదోమ బెడద నుంచి రక్షించడంలో సహాయపడే ఈ ఉత్పత్తి, రైతులకు మరింత సమర్థవంతమైన పంట సంరక్షణ పరిష్కారాన్ని అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.
పంటను ఆరోగ్యంగా కాపాడుతూ, పురుగు ఉధృతి కారణంగా కలిగే నష్టాలను తగ్గించడంలో సైలెంట్రా రైతులకు తోడ్పడుతుంది.
రాలిస్ ఇండియా ఎండీ & సీఈఓ డా. జ్ఞానేంద్ర శుక్లా మాట్లాడుతూ, రైతులు ఎదుర్కొంటున్న మారుతున్న పంట రక్షణ సవాళ్లకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలను అందించేందుకు రాలిస్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మార్సెలస్, సైలెంట్రా వంటి కొత్త ఉత్పత్తులు రైతులకు మెరుగైన పంట రక్షణ అందించి, పంట ఆరోగ్యం మరియు ఉత్పాదకతను కాపాడడంలో తోడ్పడతాయని పేర్కొన్నారు.
రాలిస్ ఇండియా క్రాప్ కేర్ బిజినెస్ హెడ్ రాహుల్ పాండే మాట్లాడుతూ, శాస్త్రీయ సాంకేతికత ఆధారంగా రైతులకు ఆధునిక వ్యవసాయ పరిష్కారాలను అందించాలన్న రాలిస్ నిబద్ధతకు ఈ రెండు ఉత్పత్తులు నిదర్శనమని అన్నారు. రైతులు తమ పంటలను వ్యాధులు, పురుగుల నుంచి సమర్థవంతంగా రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపారు.విజయవాడలో జరిగిన ఈ ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో రాలిస్ ఇండియా లిమిటెడ్ ఎండీ & సీఈఓ డా. గ్యానేంద్ర శుక్లా, బిజినెస్ హెడ్ – క్రాప్ కేర్ కార్పొరేట్ రాహుల్ పాండే, వైస్ ప్రెసిడెంట్ – సప్లై చైన్ & ప్రొక్యూర్మెంట్ అశ్వని మహాజన్,
సేల్స్ హెడ్ పి. రాజా, హెడ్ – ఫీల్డ్ మార్కెటింగ్ వై. రవి కృష్ణ, డివిజనల్ సేల్స్ మేనేజర్లు వసంత శంకర్ రెడ్డి, వెంకట్ రామి రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రాలిస్ ఇండియా సేల్స్ బృందం పాల్గొన్నారు.రాలిస్ ఇండియా, టాటా గ్రూప్లో భాగమైన భారత వ్యవసాయ రంగంలోని ప్రముఖ సంస్థల్లో ఒకటి. పంట సంరక్షణ ఉత్పత్తులు, విత్తనాలు, వ్యవసాయ పరిష్కారాల ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు సేవలందిస్తూ, ఆధునిక వ్యవసాయానికి తోడ్పడుతోంది.


