రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదు
మణిపూర్‌లో ప్రకంపనలు
బీజింగ్: పొరుగు నేపాల్‌లో జల ప్రళయం వేళ చైనాలోని సిచువాన్లో శుక్రవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. బీజింగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.13 గంటలకు లాంగ్చాంగ్ నగరంలో భూకంపం సంభవించింది. 13 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సిచువాన్ ప్రావిన్స్‌లోని లాంగ్చాంగ్ నగరాన్ని భూకంపం కుదిపేసిందని చైనా భూకంప కేంద్రం వెల్లడించింది. భూ ప్రకంపనలతో లాంగ్చాంగ్, పరిసర ప్రాంతాý ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో భారత్‌లోని మణిపూర్లోనూ భూమి కంపించింది. అక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకారం ఉదయం 10:49 గంటలకు మణిపూర్‌లో భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం వెలువడలేదు. ఈ పరిణామంతో నేపాల్- చైనా సరిహద్దు సమీపంలో భోటే కోషి నది దిగువ ప్రాంతాలకు వరద ముప్పు ఉందని నేపాల్ జలవిజ్ఞాన, వాతావరణ శాఖ హెచ్చరించింది.
చైనాలో భూకంపం
- Advertisement -
RELATED ARTICLES


