విశాలాంధ్ర అనంతపురం టౌన్ 60 లక్షల విలువ చేసే సుమారు 40 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు మరియు రూ. 1,49,500/- లక్షల నగదును ఆరుగురు అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆభరణాలు,నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ పి.జగదీష్ శనివారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధ్యాస మళ్లించి బస్సులలో ప్రయాణీకులు, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం…గుజిరీ ఏరుకొనే ముసుగులో తాళం వేసిన ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడడం జరిగిందన్నారు.ఈ ఆరుగురి ముఠా అరెస్ట్‌తో గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని 11 కేసులు, అనంతపురం III టౌన్, ఉరవకొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఒక్కో కేసు చొప్పున మొత్తం 13 కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. అనంతరంN అదనపు ఎస్పీ ఎం.నాగభూషణం మరియు గుంతకల్లు డీఎస్పీ ఏ . శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసులను వేగంగా ఛేదించిన గుత్తి సీఐ ఎం . రామారావు, సీసీస్ ఇన్స్పెక్టర్లు పి . శేషగిరి, ఇన్స్పెక్టర్ జి . జయపాల్ రెడ్డి, ఎస్ ఐ లు రాజశేఖర్ రెడ్డి, తులశన్న మరియు సిబ్బంది హెచ్ సి ’ఎస్ .విక్టర్ రాజ్ కుమార్, బి .జయకర్, వై .తిరుమలయ్య, పీసీ ’ ఎస్ – కె .రంజిత్ కుమార్, వి .బాలక్రిష్ణ, ఎన్ .వీరయ్య, డబ్ల్యూ పిసి – ఎస్ .లక్ష్మీ బాయి, గుత్తి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఎస్ కె . సురేష్, డి . అమీర్ ఖాన్,సిబ్బంది హెచ్ సి – కిషోర్, పీసీ ’స్ – సురేంద్ర కుమార్, భాషా, డబ్ల్యూ పిసి ,ఎస్ – మీనాక్షి, చంద్రకళ, మహాలక్ష్మి, రేవతిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
ఆరుగురు అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- Advertisement -
RELATED ARTICLES


