Wednesday, February 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంరజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి

రజక సమాఖ్య సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయండి…

రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. లింగమయ్య

విశాలాంధ్ర- అనంతపురం : రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, రజక సమాఖ్య సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయాలని రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. లింగమయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో రజక వృత్తిదారుల సమాఖ్య ఈ సమావేశానికి సి. వి. హరికృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లింగమయ్య మాట్లాడుతూ…. తరతరాలుగా ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజాన్ని శుభ్రంగా ఉంచేందుకు రజక వృత్తిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని సేవలంబిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రజకులను చిన్న చూపు చూస్తూ రజకుల సమస్యలను పరిష్కరించడం లో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 6నెలలు గడిచినా సక్రమంగా సకాలంలో నిధులు విడుదల చేయడం లేదని దుయ్యబట్టారు. కనీస సౌకర్యాలను కల్పించడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఆరు నెలలు గడిచినప్పటికీ ఏం మాత్రం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాల కు రజకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ జాబితా లో చేర్చాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నప్పటికీ స్పందించడం లేదన్నారు. రజకులు తమ వృత్తి లో ఆరోగ్య సమస్యలతో గురి అవుతున్నారు అన్నారు. రజక వృత్తిదారులకు కనీస సౌకర్యలు లేక దొబ్చె ఘాట్ లు కబ్జాలకు గురి అవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న ధోబి ఘాట్లు మరమ్మతలకు నోచుకోకుండా శితిలావస్థలో కొనసాగిస్తున్నారు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజక కార్పొరేషన్ల ద్వారా రజక కుటుంబాలకు రూ.10 లక్షల తగ్గకుండా సొంత పూచి కత్తితో సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకబడిన విద్యా,ఉద్యోగ,ఉపాధి, ఈ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. నేటికీ సామాజిక వివక్షతతో రజకులపై కొనసాగుతున్న దాడులను త క్షణమే అరికట్టి రక్షణ కల్పించాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వాలపై పోరాడి సాధించుకునేందుకు రజక సమాఖ్య సభ్యులుగా చేరి సంఘాన్ని బలోపేతం చేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షులు సి నాగప్ప, జిల్లా జాయింట్ సెక్రెటరీ సి ఆదినారాయణ, గౌరవ అధ్యక్షులు ఈశ్వరమ్మ, జిల్లా నాయకులు యు సి నాగరాజు, నగర అధ్యక్షులు టిసి భూషణ, నాయకులు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు