Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన

- Advertisement -

డాక్టర్ గుంపు రాఘవేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;శ్రీ రాఘవేంద్ర మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ధర్మవరం వారి సహకారంతో దంత వైద్య శిబిరం రెడ్ క్రాస్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ సేవలు నూరు మందికి అందించినట్లు క్యాంపు కోఆర్డినేటర్ చౌడయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం జడ్పీహెచ్ పాఠశాల మేడాపురం నందు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్
సత్య నిర్ధారణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరంమేడాపురం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు స్వచ్ఛంద సేవకు సహకారం అందించిన బయన్న , అస్వర్త నారాయణ , చౌడయ్య , డాక్టర్ రాఘవేంద్ర , అంతర్జాతీయ మోకాళ్ళ సంరక్షణ సమితి అధ్యక్షులు మల్లికార్జున గ్రామ పెద్దల ఆధ్వర్యంలో సన్మానించారు. దంత, ఫిజియోథెరపీ, సేవలతో పాటు గ్రూపింగ్, బ్లడ్ షుగర్ సేవలు కూడా భవిష్యత్తు క్యాంపులలో చేర్చాలని సత్య నిర్ధారణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లికార్జున,డాక్టర్ నాగార్జున, ఆరోగ్య కార్యకర్త హారిక ,సుశీల, ఏ కొండారెడ్డి, ఎల్ఐసి జెంట్ రాజా మొదలగు వారు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు