Homeజాతీయంవిద్యార్థి ఆత్మహత్య ఘటన.. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగిస్తున్న ఐఐటీ బాంబే

విద్యార్థి ఆత్మహత్య ఘటన.. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లు తొలగిస్తున్న ఐఐటీ బాంబే

- Advertisement -

ఐఐటీ బాంబే (IIT Bombay) పవయీ క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది.ఈ నేపథ్యంలో విద్యాసంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లను తొలగించాలని ఆదేశించింది. వాటి స్థానంలో వాల్‌ మౌంటెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.

పరీక్ష హాలులో సెల్‌ఫోన్‌తో..
ఐఐటీ బాంబేలో ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి సాహిల్‌ రవీంద్ర వకోడే ఇటీవల హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.పరీక్ష సమయంలో సెల్‌ఫోన్‌ను పరీక్ష హాలులోకి తీసుకెళ్లి.. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్‌ చేస్తుండగా పట్టుబడ్డట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటన తర్వాత అతడు ఆత్మహత్య చేసుకోవడం అనుమానాలకు దారితీసింది. దీంతో క్యాంపస్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఆయన తప్పుచేశారని భావించడం లేదు
పరీక్ష సమయంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించిన ప్రొఫెసర్‌ను డీన్‌ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.దీనిపై ఐఐటీ బాంబే విద్యార్థి ప్రతినిధులు స్పందించారు. సదరు ప్రొఫెసర్‌ తప్పుచేశారని తాము భావించడం లేదని తెలిపారు. అయితే విద్యార్థి మృతి ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున.. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయన్ను విధుల నుంచి పక్కన పెట్టాలని మాత్రమే కోరినట్లు చెప్పారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ప్రొఫెసర్‌కు ఫ్యాకల్టీ ఫోరమ్‌ మద్దతు
మరోవైపు, సదరు ప్రొఫెసర్‌కు ఐఐటీ బాంబే ఫ్యాకల్టీ ఫోరమ్‌ మద్దతుగా నిలిచింది. ఇన్విజిలేటర్‌గా ఆయన తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారని పేర్కొంది. విద్యార్థి మృతి ఘటనకు సంబంధించిన అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని విద్యార్థి ప్రతినిధులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు